Description
మొక్క ఎదగాలంటే నేల, నీరు, వెలుతురు, ఎరువు ఎంత అవసరమో.. ఆ మొక్క ఎదిగే క్రమంలో జంతువులు మేసివేయకుండా చుట్టూ కంచె, తెగుళ్ళ నుంచి రక్షించేందుకు క్రిమి సంహారక మందులు, ఏపుగా ఎదిగేందుకు కొన్ని మొక్కలను తుంచివేయడం కూడా అంతే అవసరం.
ఆ మొక్క మీ మెదడు అయితే..
ముందుగా లక్ష్యం అనే కంచెను చుట్టాలి
చెడు అలవాట్లనే తెగుళ్ళు వస్తుంటాయి
దుర్గుణాలనే మేకలు మేసిపోతుంటాయి
అహంకారమనే కొమ్మలు అడ్డదిడ్డంగా ఎదుగుతుంటాయి.
నీ మెదడును, నీ మేథస్సును రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే!
ఇలా చేయగలిగితే.. విజయం ఇంకెంత దూరం..?
ఇందులోని అంశాలు:
* ప్రేమ
(ఏది నిజమైన ప్రేమ? ఆ ప్రేమ నీ విజయానికా? నీ నాశనానికా? ఎలా తెలుసుకోవడం?)
* ఒత్తిడి
( ఒత్తిడికి కారణాలు?.. ఎలా ఎదుర్కోవాలి?)
* టెక్నాలజి
( విద్యార్ధికి టెక్నాలజీ వరమా? శాపమా? ఉపయోగించడంలో విచక్షణ?)
* వ్యసనం
( గంజాయి- డ్రగ్స్- బెట్టింగ్స్- అలవాట్లు… వీటి నుంచి నిన్ను నీవు కాపాడుకొనేదెలా?)
* మానసిక అవరోధాలు
( నీ విజయాన్ని అడ్డుకొనే ప్రధాన అవరోధాలేవి? ఆత్మ విశ్వాసం- అతి విశ్వాసం- ఆత్మ న్యూనత- ఇంద్రియ నిగ్రహం- నిర్లక్ష్యం)
ఈ ఐదు మెట్లు దాటగలిగితే.. విజయం ఇంకెంత దూరం..?
పేజీలు: 144
డెలివరీ ఛార్జీలు: 109
Reviews
There are no reviews yet.